Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ - భువనగిరి, బీబీనగర్‌లో ఒక రోజు సమ్మె సక్సెస్
నవతెలంగాణ - భువనగిరిరూరల్
రాష్ట్రంలోని కంపెనీల యాజమాన్యా లకు సీఎం కేసీఆర్ ఏజెంట్‌గా మారి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా, కార్మిక చట్టాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ విమర్శిం చారు. ఒక్క రోజు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నదని, అవుటో సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేస్తానని, అందరికీ కనీస వేతనాలు చెల్లిస్తామని, కార్మిక చట్టాలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు కావస్తున్నా నేటి వరకూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కనీస వేతనాల జీవోలను సవరించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జీవోలను అమలు చేస్తోందని విమర్శించారు. యాజమాన్యాలు ఇస్తున్న వేతనాలు సరిపోక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు మాట్లాడుతూ జిల్లాలోని 249 పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల కార్మికులతో అదనపు పని చేయించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రా రెడ్డి, పట్టణ కన్వీనర్ మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య, నాయకులు ఎల్లయ్య, కుమార్, రామచందర్, కృష్ణ, బాబు, శ్రీధర్, బిక్షపతి, కొండయ్య, వరమ్మ, శాంత మ్మ, యాదమ్మ, మాహలక్ష్మి, శ్యామల పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్ సంస్థల జీవోలను వెంటనే సవరించాలి
బీబీనగర్ : 73వ షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్ సంస్థల జీవోలు వెంటనే సవరించి కనీస వేతనం రూ.21 వేలు నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన ఒక రోజు సమ్మెలో ఆయన పాల్గొన్నారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం రూ.21వేలు నిర్ణయించి ఫైనల్ నోటిఫికేషన్ అమలులోకి తేవాలన్నారు. రాష్ట్రంలో ఐదేండ్లకో సారి సవరించాల్సిన షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్ సంస్థల జీవోలను ప్రభుత్వం సవరించకుండా ప్రభుత్వం మొండికేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో నూటికి 60 మంది వలస కార్మికులు ఉన్నారని, వారికి కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు, పనిగంటలు లాంటి చట్టపరమైన సౌకర్యాలు నోచకుండా దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మండల కన్వీనర్ బండారు శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్‌రెడ్డి, టంటం వెంకటేశం, సందెల రాజేశ్, ఎరుకలి బిక్షపతి, పాండు, వంటల బస్వయ్య, మునీశ్వర్‌రెడ్డి, పొట్ట యాదమ్మ, పాశం బాలయ్య, సిలివేరు రమేశ్, పొట్ట రాజు, పంజాల మహేశ్, తూపెల్లి బాల్‌రెడ్డి, మైసమ్మ, లింగమ్మ, రమేశ్, హబీబ్, సురేందర్, బాలరాజు, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.