Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని శూన్యపహాడ్ వద్ద నిత్యం రద్దీగా ఉండి ప్రమాదకరంగా మారిన రోడ్డును డెక్కన్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్మిస్తోంది.సుమారు తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ఈ రహదారిని నిర్మిస్తున్నట్లు పరిశ్రమ యాజ మాన్యం తెలిపింది. డీసీఎల్ సీజీఎం శ్రీనివాసరాజు విలేకర్లతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ వంతుగా సమాజాభివద్ధికి పాటు పడాలన్నారు.మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.ఈకార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం నాగమల్లేశ్వరరావు, పీఏ సూర్యనారాయణ, సివిల్ ఇంజనీర్ శ్రీనాథ్, శూన్యపహాడ్ సర్పంచ్ రమావత్భీకి, ఉజ్జనాయక్ తెలిపారు.