Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరా బాద్లోని ఎమ్మెల్యే నివాసంలో దౌల్తాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హనుమంత్ కు రూ.38 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవ త్సరం వందల సంఖ్యలో నిరుపేదలకు లక్షల రూపా యలు దావాఖనా ఖర్చులకు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, భాను తదితరులు పాల్గొన్నారు.