Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కార్మికులకు కనీస వేతన జీవోలను సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా కొడంగల్ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్, కాంట్రాక్టు, ఔటసోర్సింగ్, ఉద్యోగ, కార్మికులకు పీర్సి తరహాలో ప్రతేక నిర్మాణా త్మక వేతన విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ నిచ్చిన సీఎం కేసీఆర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 73 సెడ్యూల్డ్ ఎంప ీలేమీట్స్కు వర్తించే సఫాయి కర్మచారీ కార్మికులకు కూడా వేతనాలు పెర గడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీస్వాల్ కమిటీ పీఆర్సీలో కనీస వేతనం కేటగిరిలా రూ,19వేలు, రూ, 22,900, రూ.30,040,లు సిఫారసును చేసిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా, జీవో 60ని జారీ చేసి, కార్మికులకు అన్యాయం చేస్తుందని దుయ్య బట్టారు.మున్సిపల్ కార్మికుల వేతనల పెంపు ఇతర సమ స్యలు పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యో గస్తులుగా గుర్తించి, నూతన పీఆర్సీ అమలు చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ వర్కర్స్ యూనియన్ కొడంగల్ అధ్యక్షులు పకి రప్ప, కార్యదర్శి, కిష్టప్ప, జి,వెంకటప్ప కె, వెంకటప్ప, మొగుళ్ళమ తదితరులు పాల్గొన్నారు.