Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించ డానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పల్లెకు చేరుకుని ట్రాఫిక్ పోలీసులు మండల పరిధిలోని ఎల్కగూడ గ్రామ పంచాయతీ లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. సైబరాబాద్ సీపీ, ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది మల్లేశ్వరరావు, యూసుఫ్ ఈ అవగాహన సదస్సును చేపట్టామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రహదారి భద్రత, నాణ్యమైన హెల్మెంట్ ధరించడం, వాహనం నడిపేటప్పుడు ఫోన్ వినియోగించరాదని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమార్, ఉపసర్పంచ్, పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు.