Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల జీవోను సాధించేంతవరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్ ఆధ్వర్యంలో కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడుసున్నా, ఇప్పటివరకు కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక చట్టాలు అమలు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు.పరిశ్రమల్లో కార్మికులను బందీలుగా చేసి, వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయకపోవడం దురదష్టకరమన్నారు. కార్మికులందరూ ఐక్యమత్యంతో పోరాడితే త్వరలోనే సమస్యలు పరిష్కారమ వుతాయని చెప్పారు.కనీస వేతనాల జీవోను సాధించేవరకూ, లేబర్ కోడ్లను రద్దు చేసేవరకూ పోరాడాతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ క్లస్టర్ కోశాధికారి భాస్కర్, ప్రభు, సచిన్, కిషోర్, రత్నం, రాము, మైపాల్, శ్రీనివాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.