Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఈకీ యాలాల సర్పంచ్ శ్రీనివాస్ వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-కందుకూరు
మా గ్రామానికి విద్యుత్ స్తంభాలు ఇవ్వండి అని విద్యుత్ ఏఈ రమేష్‌కు శుక్రవారం యాలాల సర్పంచ్ శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాచుపల్లి గ్రామంలో విరిగి పోయిన స్తంభాలు తొలగించి, నూతన విద్యుత్ స్తంభాలు అమ ర్చినా, వాటికి వైర్లు వేలాడుతున్నాయని అన్నారు. మొదటి విడత పల్లె ప్రగతిలో భాగంగా ఈ విషయంపై విద్యుత్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధి కారు లు స్పందించి, అవసరమున్న ప్రతి చోట, స్తంభాలు అమర్చి, వేలాడుతున్న విద్యుత్ తీగెలను సవరించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఏఈ రమేష్ స్పందించి తమ గ్రామంలో విద్యుత్ సమస్య త్వరలో పరిష్క రిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాల్ రెడ్డి, నరసింహా, కృష్ణ, శ్రీశైలం, వెంకటేశ్, నరేశ్, రాజు, శ్రీనివాస్ ఉన్నారు.