Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ ఆలూరి కుమార్
నవతెలంగాణ-మొయినాబాద్
గ్రామాభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావా లని ఎల్కాగుడా గ్రామ సర్పంచ్ ఆలూరి కుమార్ అన్నా రు. మొయినాబాద్ మండలంలోని ఎల్కాగుడా గ్రామం లో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరానికిగాను గ్రామ అభివృద్ధి నూతన ప్రణాళికలు సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో గ్రామం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే అన్ని శాఖల సంబంధించిన అధికారులు వారి వారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి గ్రామ అభివృద్ధిలో భాగస్తులు కావాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు, ఆశాకార్యకర్త, సీసీ మల్లేశ్, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.