Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి
నవతెలంగాణ-తాండూరు
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పోరాటం వలన తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం సంతోషకరమని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయ మాట్లాడుతూ బీసీల జన గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల జన కుల గణనలో బీసీలను చేర్చవద్దని సుప్రీంకు మోడీ సర్కార్ చేస్తున్న విజ్ఞప్తిని తీవ్రంగా ఖండిచారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల కుల గణన చేయాల్సిందే అని తెలిపారు. లేనిపక్షంలో ప్రతి గ్రామం, పట్టణం, మండలాలు, జిల్లాల వారిగా వివిధ బీసీ కుల సంఘాలతో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.