Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్‌లో శ్రీ రామ టవర్స్‌లో ఎస్వి సెక్యురిటి మ్యాన్ పవర్ అండ్ సర్వీసెస్‌ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రత విషయంలో మెరుగైన సేవలు అందించేందుకు సెక్యూరిటీ ఏజన్సీలు కృషి చేయాలన్నారు. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లలో, ప్రయివేట్ కంపెనీలలో మంచి భద్రతకు సుక్షితులై న సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం వలన మెరుగై న సేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లింగ్యా నాయక్, విజేత సూపర్ మార్కెట్ అధినేత యమ్. జగన్ మోహన్‌రావు, టీఆర్ఎస్ నాయకులు మోహన్ముదిరాజ్, కిరణ్‌యాదవ్, మాధవరం గోపా ల్రావు, బాబ్జి, మహేందర్ ముదిరాజ్, అనిల్ కావూరి, అశోక్, వాసు, సుప్రజ, ఎస్ఆర్ ఎస్టేట్ అసోసియన్ ప్రతినిధులుతో పాటు ఆయా అపార్ట్మెంట్లు, అసోసియే షన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.