Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని కృష్ణ
నవతెలంగాణ-మంచాల
లేబర్ కోడ్ రద్దు చేసి కనీస వేతనాలు ఇచ్చే వరకు కార్మికుల పోరాటం ఆగదని సీఐటీయూ మండల కన్వీనర్ పొచమొని క్రిష్ణ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన సీఐటీయూ పోరాడుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు గ్యార పాండు, జోగు మాదవి, ఎర్పుల రవి, దూసరి భాస్కర్, జపాల జగన్, కుమార స్వామి, నాగేశ్, అర్జున్, గాలయ్య, యాదయ్య, రజిత, సాలమ్మ, కుమార్, జ్యోతి తదితరులు ఉన్నారు.