Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సతీష్ అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేసి, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగు దొడ్లు, టాయి లెట్స్ కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులను కేటాయించి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. కనీసం సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించాలని నిరసన తెలిపే హక్కు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తూ ఉందనీ, ఇది అప్రజాస్వామిక చర్యఅని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇ విద్యార్థుల సమస్యలు తెలియజేయకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆసిఫ్, శ్రీనివాస్, సమీర్, ప్రకాష్, రాజు, శ్రీకాంత్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.