Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఫరుఖ్‌నగర్
మంచి పోషకాహారంతో పాటు, రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుడ్డును మించిన ఆహారం మరొక్కటి లేదని షాద్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కుషాల్కర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా నెక్ హైదరాబాద్ జోనల్ కమిటీ మెంబర్ పాతూరి వెంకట్రావు ఆధ్వర్యంలో గుడ్డు దినోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రజలకు ఉచితంగా గుడ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ కుషాల్కర్ హాజరై, మాట్లాడుతూ గుడ్డులో ఉన్న పోషక విలువలపై ప్రపంచ వ్యా ప్తంగా నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నా యని అన్నారు. గుడ్డు మంచి న్యూట్రిషన్ ఆహార మనీ, రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా, డీ విటమిన్ అధిక మోతాదులో దొరుకుతుందన్నారు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆమ్లాలు, ప్రోటీన్లు శరీరంలో దెబ్బతిన్న బాగాలకు కణాల అభి వృద్ధికి అవసరమయ్యే మాంసకృత్తులు పుష్కలంగా లభ్యమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మలినేని శ్రీను, గూదే సతీష్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకుడు వసంత్‌రావు, పాతురి రఘు, సంజీవ్, నాగేశ్వర్రావు, నాగరాజు, కార్మిక నాయకులు పినపాక ప్రభాకర్ పాల్గొన్నారు.