Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ మండల కన్వీనర్ కురుమయ్య
నవతెలంగాణ-ఆమనగల్
పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి కనీస వేతనం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ గుమ్మడి కురుమయ్య అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సంఘటిత అసంఘటిత రంగాల కార్మి కులు నిర్వహించిన ఒకరోజు సమ్మె విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఆందోళనలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని కార్మికులకు తమ మద్దతు తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివగల్ల రమేష్, గ్రామ పంచా యతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షురాలు బేగరి యాదమ్మ, నాయకులు పాండు, అలివేల, జంగమ్మ, కాంతమ్మ, జంగయ్య, నర్సింహా, మలికాబేగం, రామచెంద్రి, చెన్నకిష్టయ్య, మల్లేష్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.