Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో 265 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథ కాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అర్హు లైన ప్రతి పేదవాడికి అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, తక్షణమే ఆ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, స్థానిక కార్పొరేటర్లో సంగీత, అర్చన డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.