Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కొత్తూరు పారిశ్రామిక వాడలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ముందస్తుగా కంపెనీ యజమానులకు సమ్మె నోటీసు ఇవ్వడంతో అందుకు స్వచ్ఛందంగా పరిశ్రమలు బందు పాటిం చడంతో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి బిసా సాయిబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్మికవర్గాన్ని పూర్తిగా విస్మరించిందనీ,రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతూ కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని దుయ్యబట్టారు. అందుకు దేశంలోని కార్మిక వర్గాన్ని ఏకం చేయాలనే సంకల్పంతో గత నెలలో కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక గర్జన పేరుతో పాదయాత్ర చేపట్టిందన్నారు. కార్మికులు ఎదురుకొంటున్న సమస్యలపై 400 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేపట్టి కార్మికుల సమస్యలను ప్రభుత్వాన్నికి తెలిపినట్టు వివరించారు. రాష్టంలో సుమారు కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారికి కనిసవేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. చట్టం ప్రకారం ప్రతి ఐదేండ్ల కోసారి ధరల కనుగుణంగా గెజిట్ చేయాలని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు.కార్మికునికి ఈ ఎస్ఐ,పిఎఫ్ అమలుచేయాలనీ,కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని సీఐటీయు పలుమార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లినా, దున్నపోతుపై వాన పడిన చందగా వ్యవహరిస్తుందని ఎద్దేవ చేశారు. అనం తరం కొత్తూరు నందిగామ పారిశ్రామిక వాడాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో నాట్కో యూనియన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్, సాయిరాం, రమేష్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, పాండు, సత్యనారాయణ రెడ్డి, రెడ్యా నాయక్, మార్కురెడ్డి, సత్యంరెడ్డి, బైండ్ల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
ఫరూఖ్ నగర్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఒక్కరోజు సమ్మె షాద్నగర్లో విజయవంతం అయ్యింది. షాద్నగర్ పట్టణంలో భారి ర్యాలీ చేపట్టి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు, సీఐటీయూ మండల కార్యదర్శి ఈశ్వర్ నాయక్ హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లలో కనీస వేతనాల జీవో సవరణ గత 13 ఏండ్లుగా ఆ జీవోల సవరణ చేయకపోవడంతో షెడ్యూల్ ఎంప్లాయీమెంట్ వర్తించే సఫాయి కర్మచారి కార్మికులకు కూడా వేతనాలు పెరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ పీఆర్సీలో కనీస వేతనం ఆయా కేటగిరీల వారీగా రూ.19వేలు, రూ. 22వేల 900, రూ 30 వేల 040 సిఫార్సులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తగ్గించి జీవో నెంబర్ 60ను జారీ చేసిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనియేడల రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మె కాకుండా గతంలో లాగా నెలల తరబడి మున్సిపల్ కార్మికులు ఇతర రంగాల కార్మికులు సమ్మెలు నిర్వహిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ శీను నాయక్, సీఐటీయూ నాయకులుచంద్రమౌళి, రాజు, మున్సి పల్ యూనియన్ రాజు, వెంకటేష్, రామచంద్రయ్య, జంగయ్య, రాజు, రాజ్ కుమార్, నర్సింలు, శ్రీను, లింగం, కుమార్, లక్ష్మమ్మ, సత్తయ్య, యాదయ్య, రామ య్య, సాయిలు, యాదయ్య, జగదాంబ, భారతమ్మ, అనసూయ, జంగమ్మ, యాదగిరి, వెంకటేష్, నర్సింగ్ రావు, రవీందర్, జంగయ్య, రామచంద్రయ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.