Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల విద్యాధికారి హరిచంద్ర
- విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
నవతెలంగాణ-పరిగి
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి హరిచంద్ర అన్నారు. 1995-1996 బ్యాచ్ పదవతరగతి పూర్వ విద్యార్థుల సంఘం జడ్పీహెచ్ఎస్ (బాలుర) పరిగి ఆధ్వర్యంలో శుక్రవారం పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి హరిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొ న్నారు. ప్రయివేటుు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ఉపాధ్యాయులు, గ్రామ యువజనులు, గ్రామ పెద్దలు ప్రజలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు విరాళాలు అందించే స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన అందుకు వారిని అభినందించారు. పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షులు జె. మాధవరెడ్డి కార్యదర్శి వెంకటేష్‌గౌడ్ మాట్లాడుతూ తమ సంఘం ఏర్పడినప్పటి నుంచి సామజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్తదాన శిబిరం, చలివేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫైయుమ సుల్తాని, స్కూల్ హెడ్మాస్టర్ రుక్మిణి, చిట్యాల స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ వెంకట్, జిల్లా విద్యాకమిటీ చైర్మన్ సి. వెంకటేష్, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు కె. శ్యామ్‌సుందర్, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు మొయిజ్ ఖాన్, బి. కృష్ణ, మోహన్, శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, కట్టప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.