Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తు న్న సీఎం కేసీఆర్ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. శుక్రవారం టీఆర్ఎస్ మండల స్థాయి, గ్రా మాల అధ్యక్ష ఎంపిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం అనేక రం గాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారని కొనియాడారు. టీఆర్ఎసÊ ఏర్పడి 20 ఏండ్లు పూర్తవుతుందని అన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం సమిష్టిగా కృషి చేయాల న్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ కందుకూరు మండల అధ్యక్షులు మన్నె జయేంద్కు నియామక పత్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అంద జేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్‌రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కపాటి పాండురంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మన్నె జయేంద్, డైరెక్టర్లు, నాయకులు సురసాని సురేందర్‌రెడ్డి, లక్ష్మీ నరసింహరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.