Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
బబితా మానసిక స్థితి బాగలేకపోవడంతో నవం బర్ 2014లో శిశు సంక్షేమ శాఖ, పోలీసుల శాఖ సహకా రంతో ట్రస్టులో చేర్పించారు. హైదర్షాకోట్ కస్తూర్బా గాంధీ ట్రస్టులో ఉంటూ మానసిక స్థితి బాగలేకపోవడం తో ట్రస్టు ఇన్చార్జి పద్మావతి ఆధ్వర్యంలో ఆలన పాలన చూశారు. ట్రస్టు తరుపున ఎర్రగడ్డలోని మానసిక ఆస్ప త్రిలో చికిత్స అందించారు. మానసిక పరిస్థితి బాగు పడ డంతో ఆమె కుటుంబ సభ్యులను వివరాలను సేకరిం చారు. చివరికి ఫోన్ నంబర్ ఆధారంగా వారి కుటుంబం వివరాలను తెలుసకున్నారు. శుక్రవారం పోలీసుల సహ కారంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించారు. వారి పెద్దమ్మ కూతురైన సుకుమతి, అన్న జనార్థన్‌లతో మా ట్లాడి వారిని ట్రస్టుకు పిలిపించారు. బబిత తల్లిదండ్రు లు చనిపోయారు. బబిత భర్త రెండేండ్ల క్రితం చనిపో యినట్టు వారు తెలిపారు. ప్రస్తుతం బబిత ఆరోగ్య, మానసిక పరిస్థితి బాగానే ఉందని, మందులు వాడుతుం దని ట్రస్టు నిర్వహకులు తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, రూ.25వేల ఆర్థిక సాయం చేశా రు. బబితాది దోర్మా గ్రామం జార్ఖండ్ రాష్ట్రం. ట్రాఫిక్‌లో తప్పిపోయిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఇన్‌ఛార్జి పద్మావతి, మేనేజర్లు శ్రీనివాస్, మూర్తి, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.