Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొడంగల్
దౌల్తాబాద్ మండలంలోని మాటూరు గ్రామంలో 12 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనంను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజరుకుమార్, జడ్పీటీసీ మహిపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, నియోజకవర్గ అధికార ప్రతినిధి టిటి రాములు నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్‌రావు, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బైరెడ్డి నరోత్తంరెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటమ్మ, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.