Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొంరాస్‌పేట్
మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం బొంరాస్‌పేట్ కేంద్రంలోని పెద్ద చెరువులో లక్షా10 వేల ఉచిత చేపపిల్లలను వదిలారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం తో స్వరాష్ట్రంలో మత్స్యకారులకు జీవనోపాధిని కల్పింస్తుందన్నారు. తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని అన్నారు.గుక్కెడు తాగునీటి కోసం గోస పడిన ఈ ప్రాంతం నేడు పచ్చని పంటలతో కళకళలా డుతోందని తెలిపారు. చేపలంటే కోస్తా ప్రాంతం దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదనీ,గత ఏడేండ్లకు ముందు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్స్య కారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో ప్రతి చెరువులో చేప పిల్లలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. జలవన రులలో క్వాలిటీ చేప పిల్లలను అధికారులు విడుదల చేయాలని తెలిపారు. కౌంటింగ్‌లో రాజీ పడొద్దనీ, విడుదల ప్రక్రియ, వీడియో గ్రఫి చేయాలని వివరిం చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరుణదేషు, వైస్ ఎంపీపీ నారన్రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు, కోట్ల యాదగిరి, మహేందర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ శ్రావణ్‌గౌడ్, టీటీ రామునాయక్, రవిగౌడ్, మహేష్ సాగర్, శేఖర్ గౌడ్, కృష్ణ, వహాబ్, సుభాష్ రావు, సలాం, జగన్, అధికారులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.