Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన్సాహస్ సంస్ధ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్
నవతెలంగాణ-కుల్కచర్ల
అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి కార్మికుడు ఈ-శ్రామ్ కార్డు పొందాలని జన్ సాహస్ సంస్ధ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండలం అంతారం గ్రామం లోనీ చెంచు కాలనీలో జన్ సాహస్ సంస్ధ ఆధ్వర్యం లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తు వులు పంపిణీ చేశారు. అనంతరం ఈ-శ్రామ్ కార్డుపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ- శ్రామ్ కార్డును ప్రభుత్వ ఉద్యో గులు, పీఎఫ్ కట్ అయ్యేవారు తప్ప మిగతా వారం దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని సూచిం చారు. ఈ శ్రామ్ కార్డు పొందడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హులని తెలిపారు. కార్డు పొందడం ద్వారా సంవత్సరం పాటు ప్రధానమంత్రి భీమా యోజన ఇన్సూరెన్స్ కల్పిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు , శాశ్వత అంగ వైకల్యం ఏర్పడితే రూ.1లక్ష బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్డును సంస్థ ద్వారా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉచి తంగా నమోదు చేసి కార్డు అందజేస్తామని తెలి పారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయడానికీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ ఉండాలన్నారు. సీఎసీ సెంటర్లో చేసుకున్నా కూడా ఉచితంగా నమోదు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుం బాలకు సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.