Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న, చిన్న మనస్పర్ధలు ఉంటే పక్క పెట్టాలి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
- 25న జరిగే ప్లీనరీ విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ- శంషాబాద్
20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో సీఎం కేసీఆర్ సమ క్షంలో రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఈ నెల 25న హైటెక్స్‌లో నిర్వహిం చే పార్టీ ప్లీనరీ నేపథ్యంలో కార్యకర్తలను సమీకరించేందుకు శుక్రవారం శంషాబాద్‌లోని ఎంఎంఆర్ గార్డెన్లో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కె. చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు దూడల వెంక టేష్‌గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ, ప్రభుత్వం ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. పార్టీ కార్యకర్తల అండదండలతో, త్యాగాలతో స్వరాష్ట్రం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నదని అన్నారు. శంషాబాద్ మండ లంలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 111 జీవో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటివరకు జరిగిన లే అవుట్లలో గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు అను మతులు ఇచ్చే అవకాశం వస్తుందని, ఈ విషయంపై స్వ యంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సముద్రం లాంటి పార్టీలో చిన్న, చిన్న మనస్పర్ధలు సహజం గా వస్తుంటాయని వాటిని సమన్వయంతో పరిష్కరించుకో వాలని సూచించారు. పార్టీలో కార్యకర్తల మనోభావాల ప్రకారం నిర్ణయాలు జరగడంలేదని, ఒకటి, రెండు గ్రామాల్లో గ్రామ కమిటీల నియామకం పూర్తి కాలేదని ఈ విషయంలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలన్న టీఆర్ఎస్ నాయకుని మాటలకు ఎమ్మెల్యే స్పందించారు. అక్కడక్కడ పార్టీ అంతర్గత సమస్య లు రావడం సహజమే అన్నారు. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఈ విషయాన్ని పెద్దగా చేసి చూడాల్సిన అవసరం లేదన్నారు. 25న జరిగే పార్టీ ప్లీనరీ విజయవం తం చేయడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సూచిం చారు. కార్యకర్తలను బస్సుల్లో తరలించే ప్లీనరీకి వచ్చేందు కు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్లీనరీ అనంతరం నియో జకవర్గస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం జరగనుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కే. సుష్మ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, జడ్పీటీసీ తన్విరాజుముదిరాజ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీలం మోహన్‌నాయక్, ఆర్. గణేష్‌గుప్తా, మ చ్చర్ల మోహన్‌రావు, దండు ఇస్తారి, భాగ్యలక్ష్మి శ్రీకాంత్ యాదవ్, ఇ. అజరు, మేకల వెంకటేష్, దేవిక జగన్, శ్రీని వాస్‌గౌడ్, బుచ్చిరెడ్డి, స్రవంతిశ్రీకాంత్రెడ్డి, కొనమోళ్ల శ్రీని వాస్, బొమ్మ దవనాకర్గౌడ్, సంతోష ప్రభాకర్, వి. సతీ ష్‌యాదవ్, కటికల రాజ్‌కుమార్, ఎం.మహేందర్‌రెడ్డి, దేవ రకొండ రమేష్, మునగాల అమృత, గాదె రాజశేఖర్, దీప మల్లేష్, గడ్డమీది యాదగిరి, ఆనెగౌని శ్రీకాంత్‌గౌడ్, బు ర్కుంట సతీష్. ఎం.మల్లారెడ్డి జిట్టే సిద్ధులు, చేవెళ్ల ప్రసాద్, కర్రే నరసింహ, జుర్కి రమేష్, తదితరులు పాల్గొన్నారు.