Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే , జడ్పీటీసీలకు ధన్యవాదాలు
- చౌదర్గూడా సర్పంచ్ కటికల రాజ్ కుమార్
నవతెలంగాణ-శంషాబాద్
రోడ్డు నిర్మాణ విస్తరణతో మూడు గ్రామాలకు మహర్దశ వస్తుందని శంషాబాద్ మండల పరిధిలోని చౌదర్గుడా సర్పంచ్ కటికల రాజ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం చౌదర్గూడా గ్రామపం చాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండల పరిధిలోని నర్కూడ గ్రామం నుంచి చౌదర్గూడా మీదుగా పెద్ద షాపూర్ వరకు ఐదున్నర కిలోమీటర్ల దూరం 40 ఫీట్ల రోడ్డును నిర్మిస్తున్నారని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులమీ దుగా మండల పరిధిలోని నర్కూడ-పెద్ద షాపూర్, ఘాన్సీమియా గుడా - శంకరాపురం, రాయన్నగూడ - నానాజీపూర్, మక్త గూడ - పిల్లోనిగుడా గ్రామాల మధ్య అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. నర్కూడ గ్రామం నుంచి పెద్ద షాపూర్ వరకు 40 ఫీట్ల రోడ్డు నిర్మాణంలో 18 సీట్లు రోడ్డు కిరువైపులా 11:11 ఫీట్లు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. చౌదర్గుడా -నర్కూడ వయా శంషాబాద్ మీదుగా పెద్ద షాపూర్ చేరుకోవాలంటే సుమారు పదిహేను కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తుందని అన్నారు. చౌదర్గూడా-పెద్ద షాపూర్ మధ్య కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఉండడంతో రెండు గ్రామాల మధ్య దూర భారం తగ్గుతుందని అన్నారు. కేవలం ఐదున్నర కిలోమీటర్ల దూరం ఉన్న నర్కూడ నుంచి పెద్ద షాపూర్ నేషనల్ హైవే 44 సులువుగా చేరుకోవచ్చని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం శంకుస్థాపనతో పాటు పనులు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. రోడ్డు నిర్మాణం కోసం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్, శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.