Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలి
- మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ గార్డెన్లో మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చిలుకల బుగ్గ రాములు, గంగిరెడ్డి భాస్కర్ రెడ్డిల అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ ప్లీనరీ, వరంగల్లో విజయ గర్జన సభల అంశంపై ఇబ్రహీంపట్నం మండలం ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు. వరంగల్లో జరిగే విజయగర్జనకి నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాలలో పార్టీ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టిఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో సీఎం చేపట్టిన సంక్షేమ పథకాలను, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిట్ల వెంక రెడ్డి, మహేందర్ రెడ్డి, రైతు సంఘం మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, మండల నాయకులు డేరంగుల నరసింహ, కాలే గణేష్, మంకాల దాసు, రాములు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు బూడిద రాంరెడ్డి, సర్పంచులు బల్వంత్రెడ్డి, కంబాలపల్లి గీతారెడ్డి, అండాలు, చిలకల యాదగిరి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతిరెడ్డి, చెరుకూరి మంగా రవీందర్, నాగమణి, కో-ఆప్షన్ షరీఫ్, యువజనా మండల అధ్యక్షులు నిమ్మల ప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భగీరథ సాగర్, అచన శ్రీకాంత్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు దొడ్డ మనీష్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు పంది మైసయ్య, మోహన్, గ్రామ ఉపసర్పంచ్ బాలరాజు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.