Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్ పేట్
టీఆర్ఎస్ పార్టీ అభివద్ధి కోసం నిరంతరం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్లోని ఓ ఫంక్షన్ హాల్లో మీర్ పేట్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. పార్టీ అభివద్ధి కోసం పని చేసే వాళ్లకు తప్పకుండా పార్టీ పదవులు వస్తాయని తెలిపారు. పదవులు వచ్చిన వారు అందరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ద్వేయంగా 20 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి, రాష్టం సాధించి తెలంగాణను అగ్రభాగాన నిల్పిన కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 856 ప్రాంతీయ పార్టీలు ఏర్పడగా కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయన్నారు. అందులో తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే ఉండగా తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లో లాంటి కొన్ని రాష్టాల్లో మాత్రమే మనుగడ సాధించాయని గుర్తు చేశారు. నవంబర్ 15వ తేదీన జరిగే భారీ బహిరంగసభకు వివిధ అనుబంధ సంఘాల కార్యవర్గాలలో 900 మంది వరకు సభ్యులు వారితో పాటు ముఖ్య కార్యకర్తలు తరలిరావాలని పేర్కొన్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా చెరువులకు లింక్ చేయడం కోసం 850 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. తాగునీటి కోసం రిజర్వాయర్లు, పాత పైపులైన్ల మార్పుకు కూడా నిధులు విడుదల చేసారని తెలిపారు. అనంతరం వివిధ పదవుల్లో నియమితులు అయినా నేతలకు మంత్రి నియామక పత్రాలు అందజేసారు. సమావేశంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భుపేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, అధికార ప్రతినిధి బండి నాగేష్, మాజి అధ్యక్షురాలు సిద్రాల లావణ్య, పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.