Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్వకోల్ గ్రామ సర్పంచ్ గాదె థామస్ రెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
గ్రామాభివృద్ధే లక్ష్యంగా తను పనిచేస్తున్నానని మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్ గ్రామ సర్పంచ్ గాదె థామస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్నివిధా లా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నామని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటి పరిష్కారం కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చంద్రయ్య యాదవ్, మండల కార్యవర్గ సభ్యులు సాయిని మధుసూదన్‌రెడి, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ కొండని లక్ష్మణ్, గూడెం శ్రీను, బొజ్జ మల్లేష్, ఆరడి రమేష్, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.