Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నం భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు స్వప్న
- సీఐటీయూ అధ్వర్యంలో ఎంఈఓకి వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులతోనే కొనసాగించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు స్వప్న అన్నారు. శుక్రవారం మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహింపట్నం మండల విద్యాధికారి వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టే యోచనలో ప్రభుత్వం ఉందని మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడానికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం 2002 సంవత్సరంలో ఈ పథకం ఏర్పడిందని, 2009 సంవత్సరం నాటి నుండి ఒకవెయ్యి రూపాయలు గౌరవ వేతనంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ 19 సంవత్సరాల నుండి వారి జీవనాధారంగా కొనసాగుతుందని, వారికి పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ. సౌకర్యం లేకున్నా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బిసి మైనారిటీలు అత్యధికంగా మహిళలు ఈ రంగంలో పనిచేస్తున్నారని, ఉపాధి తీయడం పట్ల కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు 5 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనం ఇవ్వకపోతే వేతనం ఇచ్చేంతవరకు పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీఐటీయు కార్యదర్శి చింతపట్ల ఎల్లేశ, మంచాల మండల సీఐటీయు నాయకులు పోచమోని కష్ణ, ఇబ్రహీంపట్నం మండల నాయకులు సీఎచ్ బుగ్గరాములు, మధ్యన భోజన కార్మికులు బి జయమ్మ, ధనమ్మ , ప్రేమలత, సుక్కమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.