Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
ఎస్ఎస్సి సభను విజయవంతం చేయాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షుడు లక్నపూర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ 87వ జయంతి, మరియు ఎస్ఎస్సి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేరో ఆవిర్భావ దినోత్సవాన్ని పరిగిలోని డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట నిర్వహించారు. ఎస్ఆర్ శంకరన్ దళిత బహుజనుల కోసం పోరాటం చేశారని అన్నారు. అయన అత్యంత మదు స్వాబావి అని, ఆయన నిడంబరంగ బ్రాహ్మణ జీవితాన్ని గడిపారన్నారు. బ్రాహ్మణుడే అయిన దళిత బహుజన గిరిజనులు నా పిల్లలు అని అయన వివాహ జీవితాన్ని పక్కకు పేట్టి దళిత, బహుజన, గిరిజన, వర్గలకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహౌన్నత వ్యక్తి అని కొనియాడారు. విరి జీవితలకోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ వర్గాలలో వెలుగులు నింపిన వ్యక్తి అని అన్నారు. అందుకే అయన జయంతిని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో నెలకొల్పిన స్వేరోస్ను స్వేరోస్ డే గా పది సంత్సరల నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 24న గుంటూరులో జరిగే స్వేరోస్ స్టేట్ కన్వెన్షన్ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి.శ్రీనివాస్, ఫిట్ ఇండియా జిల్లా అధ్యక్షులు అర్ రాజు, జిల్లా అంబేత్కర్ విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు టి వెంకటయ్య, టిఎంటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బుగయ్య, టీటీసీ జిల్లా అధ్యక్షులు కే వెంకటయ్య, బంసెఫ్ జిల్లా నాయకులు బుచ్చయ్య, డివిజన్ అధ్యక్ష కార్యదర్శలు ఎల్ అనంతయ్య, కర్ణకర్, పరిగి డివిజన్ సలహాదారులు వినోద్ కుమార్, యం.శ్రావణ్ కుమార్, రాజేందర్, సుధాకర్, కే.వెంకటయ్య, దయాకర్, రాములు, నర్సింహరాజు, నర్సింలు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.