Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
- కల్యాణలక్ష్మి, షాధిముబారక్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-మొయినబాద్
రాష్ట్ర ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.మొయినబాద్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 72 మందికి కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తహశీల్దార్ అనిత కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అభివద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. పేద కుటుంబంలో మహిళల వివాహనికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కళ్యాణాలక్ష్మి పేరుతో ఆదుకుంతున్నారని అన్నారు.కార్యక్రమంలో ఎంపిపి నక్షత్రం, జడ్పిటిసి కాలే శ్రీకాంత్ ,తహశీల్దార్ అనిత,డిప్యూటీ తహశీల్దార్ తాజుద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు