Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు బీజేపీ కారణం
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవం
నవతెలంగాణ-కొడంగల్
తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవిం చిందని విద్యశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు కొడంగల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రెడ్డి బస ిరెడ్డి ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కస్తూర్బా గురుకుల పాఠశాలను ప్రారంభించారు. నియోజక వర్గం విస్తతస్థాయి సమావేశంలో వారు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవిం చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే తెలంగాణ ఆవిర్భవిం చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో నిలిచి పోతోందన్నారు. దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నాయని అన్నారు. పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగడానికి టీఆర్ఎస్ ప్రభు త్వం కారణ మనీ, బీజేపీ నాయకులు అనడం సరైంది కాదనీ, కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతం సీఎం కేసీఆర్ నిరు పేదల అభివృద్ధికి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అభినందించారు. ఈ నెల 15న వరంగల్‌లో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ విజయో త్సవ సభకు నియోజకవర్గం నుంచి 209 బస్సు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.ఈ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మెన్ విజరు కుమార్, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మెన్ జగదీశ్వర్‌రెడ్డి, దౌల్తాబాద్ మండల ఎంపీపీ విజరు కుమార్, జడ్పీటీసీ మహిపాల్, వైస్ ఎంపీపీలు మహిపాల్ రెడ్డి, నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మెన్లు విష్ణువర్దన్‌రెడ్డి, శివ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రావు, దామోదర్ రెడ్డి, కోట్ల యాదగిరి, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి టీ టీ రాములు నాయక్, సలీం, జడ్పీటీసీలు నాగరాణి, అరుణ్ దేశ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు, సర్పం చులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.