Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో విడుదల చేసే విధంగా చర్యలు తీసు కోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఎస్ఎస్ఆర్-2022 పై వీడియో కాన్ఫెరెెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ వరకు వచ్సిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయాలన్నారు. ముసాయిదా కాఫీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలనీ, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫొటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేదీ నుంచి సరిచేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి, 5వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని ఆదేశించారు.
ఓటర్లు ఇండ్లు మారడం వల్ల పోలింగ్ స్టేషన్లు అదనంగా అవసరం ఉంటే, లేదా పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చాలన్నా,ఉన్న ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు ఓటర్ల మార్పు, చేర్పులు చేసుకోడానికి గరుడ యాప్ను అందజేశామనీ, ఈ యాప్ను ఎలా ఉపయోగించాలో, బూతు లెవెల్ అధికారులకు (బీఎల్వో) పూర్తి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఈవీఎంపాత గోదాములు నుంచి ,కొత్త గోదాములకు మార్చాలని తెలిపారు. ఈ నిర్మా ణాలు పూర్తి చేయని వారు వెంటనే పనులు ముమ్మరంగా చేయాలని చెప్పారు. ఈవీఎంల భద్రతపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయా లన్నారు. అన్నీ జిల్లాల్లో స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జనవరి, 1 2022 నాటికి 18 ఏండ్లు పూర్తి అయిన యువతీ,యువకులు ఆన్లైన్ ద్వారా, లేదా ఫారం 6 ద్వారా కానీ ఓటరు జాబితాలో తమ పేరులను నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎలక్షన్ సెక్షన్ సూపరిం టెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.