Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాల యాదయ్య
- చేప పిల్లల పంపిణీ
నవతెలంగాణ-మొయినాబాద్
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపినా ఘనత కేసీిఆర్ దేనని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం మోయినాబాద్ మండలంలోని చిలుకూరు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకంలో స్వరాష్ట్రంలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గతంలో చేపలంటే కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకునేవారనే భావన ఉండేదనీ, గత ఏడేండ్లలో నేడు చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్స్యకారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతా వరణంలో ప్రతి చెరువులో చేప పిల్లలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. జలవనరులలో క్వాలిటీ చేపపిల్లలను అధికారులు విడుదల చేయాలనీ, కౌంటింగ్లో రాజీ పడొద్దనీ, విడుదల ప్రక్రియ వీడియోగ్రఫీ చేయాలని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీి నక్షత్రం, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్, చిలుకూరు గ్రామ సర్పంచ్ స్వరూప, హిమాయత్ నగర్ సర్పంచ్ మంజుల, మోత్కుపల్లి సర్పంచ్ రామచంద్ర రత్నం, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మోర శ్రీనివాస్, ఎంపీటీసీలు బంటు మల్లేష్, జినుకుంటా అర్జున్ నాయకులు జయవంత్, ఆండ్రూ, గోపి కృష్ణరెడ్డి, రాఘవేంద్రర్ యాదవ్, వార్డు సభ్యులు వెంకటేష్, శ్రీరాములు, రవి యాదవ్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు, మండల ప్రజలు తదితరులున్నారు.