Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిర్సంపల్లి గ్రామ పంచాయతీ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష
- మద్దతు తెలిపిన దళిత, గిరిజన, బీసీ ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామనికి చెందిన చిల్కమురి బిచ్చమ్మ కొనుగోలు చెసిన భూమినీ రిజిస్ట్రేషన్ చేయాలనీ దళిత, గిరిజన,బీసీ, ప్రజాసంఘాల నాయకులు అన్నారు.బుధవారం దిర్సంపల్లి గ్రామ పంచాయతీ ఎదుట బిచ్చమ్మ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా దళిత, గిరిజన, బీసీ ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ దిర్సంపల్లి గ్రామానికి చెందిన కన్కిరెడ్డి అనంతరెడ్డి తండ్రి రామిరెడ్డి దగ్గర 2012 సంవత్సరంలో సర్వే నెంబర్ 230/ఏ 1 0-10 గుంటల భూమిని కోనుగోలు చెసింది. గతంలో సాదబైనామాలో కూడా దరఖాస్తు చెసుకున్నారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ ఆమె పేరుపై చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. అనంతరెడ్డి వారి కుటుంబానికి మోసం చేశాడని అందుకు బాధితురాలు బిచ్చమ్మా కొనుగోలు చెసిన భూమిని ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. బాధితురాలు బిచ్చమ్మ 10 గుంటల భూమిని ఆమెకు న్యాయంగా రిజిస్ట్రేషన్ చేయాలని దళిత, గిరిజన, బీసీ, ప్రజాసంఘాలు సంఘీభావం డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఎల్.హెచ్.పీి.ఎస్ జిల్లా అధ్యక్షులు గోవింద్ నాయక్, బీఎస్పీ మండల నాయకులు గార్లపల్లి మల్లన్న, అంబే ద్కర్ యువజన సంఘం తాలుకా అధ్యక్షుడు బడేంపల్లి జోగు భాస్కర్, అంబేద్కర్ సంఘాల నాయ కులు బండి వెంకట్, నర్సింహులు, భాదిత కుటుంబ సభ్యులు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.