Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నార్నె ఎస్టేట్స్ ,సెంట్రల్ పార్క్ ఫేస్2లలో రూ. 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కూడా అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు కొనసాగి స్తోందన్నారు. శేరిలింగంపల్లి నియోకజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిద్దు తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ శ్రీనివాస్, ఏ.ఈ సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, పవన్, గోపాల్, ప్రసాద్, సెంట్రల్ పార్క్ ఫేస్-2 అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ రమణి శ్రీరామనేని, సురేష్, రామకృష్ణ, హరినారాయణ, ప్రవీణ్, వేణు, రాధకృష్ణ, జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.