Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చూసి చూడనట్టుగా వదిలేస్తున్న సంబంధిత అధికారులు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని మేడిపల్లి గ్రామకంఠం భూమిలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. మేడిపల్లి గ్రామకంఠం భూమి చుట్టూ ఉన్న పట్టాదారులకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే సర్వే చేయిస్తామని తహసీల్దార్ నాగయ్య తెలిపారు. గ్రామస్తులు భూమి సర్వే చేయాలని, ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వేయర్ మేడిపల్లికి బుధవారం రావడం జరిగింది. గ్రామకంఠం భూమి చుట్టూ ఉన్న పట్టాదారులు తమకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే సర్వే చేయించాలని కోరడంతో, ఈ మేరకు భూమిని సర్వే చేయకుండా సర్వేయర్ వెనుదిరిగి వెళ్లి పోయారు. అయితే కొంతమంది ఎలాంటి అనుమ తులు లేకుండా గ్రామకంఠం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఈ నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఆ గ్రామకంఠం భూమి లో ఓ పట్టాదారుడు ఈ భూమి నాదేనంటూ కొందరికి అమ్మేశాడు. ఈ విషయంపై గ్రామ పంచా యతీ వార్డు సభ్యులు, కొంతమంది గ్రామ ప్రజలు గ్రామకంఠం భూమి సర్వే చేయించాలని సంబంధిత అధికారులకు పత్రా లు పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి కూడా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకుండా, సంబంధిత అధికారులు చోద్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు గ్రామకంఠం భూమి సర్వే చేయించి నిరుపేదలకు పంపిణీ చేయా లని కోరుతున్నారు.
వారం రోజుల్లో గ్రామ కంఠం భూమిని సర్వే చేయిస్తాం: తహసీల్దార్ నాగయ్య
మండల పరిధిలోని మేడిపల్లి గ్రామకంఠం భూమి ని వారం రోజుల్లో సర్వే చేయిస్తాం. గ్రామ కంఠం చుట్టూ ఉన్న పడ్డ దారులకు వెంటనే నోటీసులిచ్చి సర్వే చేపడ తాం. అప్పటివరకు గ్రామ ప్రజలంతా సమన్వయంతో ఉండి అధికారులకు సహ కరించాలి. అప్పటిలోగా గ్రామకంఠం భూమి సర్వే చేసి హద్దులను గుర్తిస్తాం. అప్పటివరకు ఎవరు మాభూమి జోలికి పోవద్దు.
అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చి వేస్తాం: పంచాయతీ సెక్రెటరీ రాజలక్ష్మి
మేడిపల్లి పరిధిలోని గ్రామకంఠం భూమి లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం. ఈ భూమిని సర్వే చేసేంతవరకు ఎవరు ఎలాంటి నిర్మాణాలు చే పట్టవద్దు. చెప్పిన వినకుండా నిర్మాణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ భూమి సర్వే చేసేంతవరకు ఎవరు ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టిన వెంటనే కూల్చి వేస్తాం.
నిరుపేదలకు పంచాలి:(సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహా
మేడిపల్లిలో ఉన్న గ్రామకంఠం భూమిని పూర్తిస్థాయిలో అధికారులు సర్వే చేసి హద్దులు గుర్తించాలి. గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారిని గుర్తించి, స్థలాలు ఇవ్వాలి.గ్రామంలోని కొంతమంది పట్టా దారు పేరుతో గ్రామకంఠం భూమిని కబ్జా చేస్తున్నారు.ప్రభుత్వ అధికారులు వారి నుంచి గ్రామకంఠం భూమిని కాపాడాలి.