Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని బందావన్ గార్డెన్లో పరిగి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారు అని అన్నారు. నేడు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు ఏదో రకంగా ప్రతి గడపకు అందుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారికి అందేలా చూడాలని సూచించారు. గ్రామాలలో సమస్యలు ఏమన్నా మండల స్థాయి నాయకులతో గాని లేదా తన దష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలకు నిధులు ఇస్తుందని అన్నారు. నేడు గ్రామాలలో వైకుంఠములు, పల్లె ప్రకతి మరి ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. దళిత బంధు పథకాన్ని విడతలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తారని అన్నారు. కుల వత్తుల వారికి ప్రోత్సాహం ఇస్తూ, అన్ని వర్గాలకు సమానంగా అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పరిగి నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. మార్చి తర్వాత ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి నియోజకవర్గానికి 2000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానున్నాయని తెలిపారు. నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివద్ధి పథంలో తీసుకు పోతున్నారని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, జెడ్పిటిసిలు నాగిరెడ్డి, హరి ప్రియ ప్రవీణ్ రెడ్డ్డి, ఎంపీపీలు అరవిందరావు, అనసూయ, సత్యమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు మీర్ మహమూద్ అలీ, బాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి, ఆంజనేయులు, తాహెర్ అలి, అన్వర్ సెట్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.