Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు/పెద్దేముల్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళికృష్ణ గౌడ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెల్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్‌లో జరిగే సింహగర్జన కార్యక్రమానికి నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైద్య ఆరోగ్య మౌళిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, ఎంపీపీలు బాలేశ్వర్ గుప్త, కరుణ అజరు ప్రసాద్, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ అరుణ గోపాల్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), తాండూరు మండల అధ్యక్షులు రాందాస్,పెద్దేముల్ మండలాధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, తాండూరు మండలాధ్యక్షులు రాందాస్, యాలాల మండల అధ్యక్షులు మల్లారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, సీనీయర్ నాయకులు రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పట్లోళ్ల రత్నమాల, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మహిళ నాయకురాలు, కౌన్సిలర్ విజయదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.