Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజేంద్రనగర్ 16వ మెజిస్ట్రేట్ జడ్జి రూబినా ఫాతిమా 14వ మెజిస్ట్రేట్ జడ్జి సుచిత్రలు తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అండాపూర్లో రాజేంద్రనగర్ కోర్టు బార్ కౌన్సిల్ ఏక్సిగూటివ్ మెంబర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన న్యాయ సేవలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయం చేయని వారు ధైర్యంగా తమ వాదనలు వినిపిస్తే వారికి న్యాయవ్యవస్థ అండగా ఉంటుందన్నారు. మహిళలు విద్యార్థులు ఎవరైనా తమని వేధిస్తే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అలా కాని పక్షంలో కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెళ్లిలో కట్నం తీసుకోవడం ఇవ్వడం చట్టపరమైన నేరమని అలాంటి వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మహిళలు విద్యార్థులు బయటి వ్యక్తులు నిర్వహించే ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అన్నారు. అనాధ పిల్లలతో పాటు వద్ధులకు అండగా న్యాయ సేవలు ఉచితంగా అందించేందుకు ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థ ముందుంటుందన్నారు. మండల్ లీగల్ సర్వీస్ ఆథారిటీ ద్వారా కమిటీని ఏర్పాటు చేసి పేదవారికి ఉచితంగా న్యాయ సలహాలను కోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు కషిచేయాలని సూచించారు. ఇప్పటికే వనస్థలిపురంలో కొనసాగుతుందని గుర్తు చేశారు. గ్రామ సర్పంచ్ బూర్గు రవళి గోపికష్ణరెడ్డి మాట్లాడుతూ మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయన్నారు. అలాగే అండాపూర్ గ్రామంలో బెల్టు దుకాణాలు అధికంగా ఉన్నాయని ఎన్నిసార్లు ఆప్కారి శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని జడ్జిల దష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె ఇద్దరు జడ్జిలను సన్మానించారు. కార్యక్రమంలో సిఐబి రాజు, ఎస్సైలు జగదీష్, నారాయణ్ సింగ్ రాజేంద్రనగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రవీణ్ కుమార్ కుమార్, బైకని కుమార్, గ్రామ సర్పంచ్ గోపి కష్ణారెడ్డి ఎంపిటిసి సామ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ వడ్ల నాగార్జున చారి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, అంగన్ వాడి టీచర్ సరస్వతి, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు