Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు సలహా సూచనలు పాటించాలి
- కంది పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్
నవతెలంగాణ-తాండూరు
వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సలహా సూచనలు పాటించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సుధాకర్ అన్నారు. బుధవారం తాండూర్లోని వ్యవసాయ పరిశోధన స్థానం, తాండూరు, కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సహాకారంతో పరిశోధన స్థానం తాండూర్లో కంది పంటలపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అథితులుగా వ్యవసాయ పరిశోధన స్థానం తాండూర్ ప్రధాన శాస్త్రవెత్త, హెడ్ డాక్టర్ సి.సుధాకర్, ఏరువాక కేంద్రం, తాండూర్ కోఆర్డీనేటర్ డాక్టర్ ప్రవీణ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెట్ కోరమండల్ భాసకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం తాండూర్ కోఆర్డీనేటర్ డాక్టర్ ప్రవీన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కంది పంట సాగులో పాటించవల్సిన మెళుకువలు, జాగ్రతలను గురించి క్లుప్తంగా రైతులకు వివరించారు. వ్యవసాయ పరిశోధన స్థానం తాండూర్ ప్రధాన శాస్త్రవెత్త, హెడ్ డాక్టర్ సీ. సుధాకర్ మాట్లాడుతూ కంది పంట సాగు చేసే విధానం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పని చేస్తున్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం తాండూర్ వారు తాండూరు కందికి దాని కుండె ప్రాముఖ్యత దృష్ట్యా భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తుందన్నారు. ఈ భౌగోళిక గుర్తింపు కనుక వస్తే తాండూరు ప్రాంతంలో కంది పండించే రైతులకు ఆర్థికంగా గొప్ప మేలు జరగనుందన్నారు. అనంతరం శాస్త్రవేత్త శ్రీ.టి.రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కంది పంటకు సంబంధించిన చీడపీడలు, తెగుళ్ళ బారిన పడిన, వైరస్ అటాక్ అయినా ఇలాంటి సమస్యలు పంటకు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా సలహాలు సూచనలు చేశారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కోరమండల్, భాసకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎరువుల వినియోగం, పంట దిగుబడులను పెంచుకునెందుకు తీసుకోవల్సిన జాగ్రతలను వివరించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ లు మాట్లాడుతూ.. తాండూర్ ప్రాంతం కంది సాగుకు చాలా అనుకూలమైదని తెలిపారు. కార్యక్రమంలో ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు, వ్యవసాయ పరిశోధన తాండూర్ శాస్త్రవెత్తలు డాక్టర్ సుజాత, డాక్టర్ సందీప్, మాణిక్య మిన్నీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.