Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం షాద్నగర్ పట్టణంలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పథకాలను పక్క రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రంలో అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. రైతు భీమా, రైతు బంధు పథకాలతో రైతులకు, ఆసరా పింఛన్లతో వద్దులకు, మహిళలకు, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్లతో పేదింటి యువతులకు ఇలా ప్రతి ఒక్కరికి ఎదో విధంగా తెలంగాణ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యకర్తలంతా నవంబర్ 15న జరిగే విజయ గర్జన సభకు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఫరూఖ్ నగర్ ఎంపిపి ఖాజా ఇంద్రిస్, జడ్పిటిసి వెంకట్ రాం రెడ్డి, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, కేశంపేట ఎంపిపి రవీందర్ యాదవ్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.