Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ తీసుకొని వారికి అవగాహన కల్పించాలి
- సమీక్ష సమావేశంలో తహసీల్దార్ చిన్నఅప్పలనాయుడు
నవతెలంగాణ-తాండూరు రూరల్
మూడు రోజుల్లో ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ సర్వే పూర్తి చేయాలని తాండూరు తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు అన్నారు. బుధవారం తాండూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆశ వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శులు బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి మూడు రోజుల్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అందులో ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, మొదటి డోసు ఎంతమంది, రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు ఎంతమంది, అసలు తీసుకోనివారు ఇలా మూడు కాలాలతో ఆశ వర్కర్లు అంగన్వాడీలు పంచాయతీ కార్యదర్శులు బీఎల్వోలు సర్వే సమగ్ర నివేదిక పూర్తి చేయాలన్నారు. వ్యాక్సిన్ తీసుకుని వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. వ్యాక్సిన్ పైన ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని దీంతో ఎవరికీ ఎలాంటి అపాయం జరగదని ప్రజలను చైతన్యపర్చి 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇప్పించి తాండూరు మండలాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు కషి చేయాలన్నారు. ఇందుకోసం అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రజలను చైతన్య పరిచేందుకు ముందుకు వచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేసే బాధ్యత మీ పైన ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి, సీడీపీవో రేణుక, మండల పంచాయతీ అధికారి రతన్ సింగ్, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.