Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
నేడు వేపచెట్టు ఉనికి ప్రమాదంలో పడింది అంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. పర్యావరణంలో వచ్చిన మార్పులు లేదా మరేదో కారణం వల్లనో వేప చెట్టు ఎండి పోయే పరిస్థితులు దాపురించాయి. వివరాల్లోకి వెళితే ఈ భూమ్మీద అత్యంత విలువైన ప్రధాన చెట్లలో వేప చెట్టు ఒకటి. ఎన్నో ఆయుర్వేదిక గుణాలతో పాటు ఎక్కువ శాతం ఆక్సిజన్ ఉత్పత్తి చేసి సకల మానవాళికి అన్ని రకాలుగా ఉపయోగపడే చెట్లలో ముందువరుసలో ఉండేది కూడా వేప చెట్టు. ఎంతో విలువైన వేప చెట్టు నేడు ప్రమాదంలో పడింది. వర్షాకాలం వెళ్లి కొద్ది రోజుల తర్వాత వచ్చే గ్రీష్మ ఋతువులో చెట్లకు ఉండే ఆకులు రాలి వసంత రుతువులో పచ్చని చిగుళ్ళతో మొదలై ఉగాది పూత కాతలతో ఆకుపచ్చని రంగులో ఎండ వేడిమి నుంచి ఎంతో ఉపశమనం ఇస్తూ ఉండేది వేప చెట్టు మాత్రమే. అయితే వేపచెట్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా శంషాబాద్ మండలంలో ప్రతి వేప చెట్టు కొమ్మలు తెగుళ్లతో వాడి పోతున్నాయి. కొన్ని చెట్లు కాండం నుంచి ఎండిపోతున్నాయి. శంషాబాద్ మండలం నర్కూడ, అమ్మపల్లి రెవెన్యూ పరిధిలో ప్రతి వేప చెట్టు కొమ్మలు ఎండిపోయి చెట్లు కల హీనంగా మారాయి. అమ్మపల్లి శివా లయం ఎదురుగా ఉన్న చెట్టు పూర్తిగా ఎండిపోయింది. చిన్న వేప చెట్టుతో పాటు పెద్ద చెట్లు కూడా ఎండి పోవడం పర్యా వర ణంలో వచ్చిన సంక్షోభం వల్లనే కావొచ్చనే అనుమానం కలుగు తున్నది. కరోనా మహ మ్మారి దేశంలోకి ప్రవేశి ంచిన తరువాత ఏర్పడిన పర్యావరణం పరిస్థి తుల కారణంగా ఈ వేప చెట్లకు తెగుళ్ళు వస్తున్నట్లు తెలు స్తున్నది. ఇలాగే ఉంటే భవిష్య త్తులో వేపచెట్టు కనుమ రుగయ్యే ప్రమాదం ఉంది. పర్యావరణ వేత్తలు, వృక్ష శాస్త్ర వేత్తలు, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే అధ్యయనం చేయాలని ప్రజలు కోరుతున్నారు. శంషాబాద్ మండలంలో ప్రభుత్వం హరితహారం కింద నాటిన చెట్లు, సహజసిద్ధంగా పెరిగిన చెట్లలో ఈ రకమైన తెగులు వచ్చి ఎండిపోయిన దాఖలాలు లేవు. ప్రధానమైన వేపచెట్టు ఈ తెగులు రావడం ఆందోళన కలిగిస్తున్నది.
వేప చెట్టు రక్షణ చర్యలు చేపట్టాలి
గ్రామ దేవతలకు సింబాలిక్‌గా ఎన్నో అరుదైన ఆయుర్వేదిక లక్షణాలు కలిగిన ప్రధానమైన వేపచెట్టు తెగులు సోకి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని వేప చెట్లు ఎండిపోవడం పర్యావరణంలో వచ్చిన మార్పులు కారణంగా జరిగి ఉండవచ్చు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి వేప చెట్లకు సోకిన వైరస్ గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టాలి.
లింగం రామారావు, రైతు నర్కూడ