Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
టీఆర్ఎస్ బలోపేతానికి మరింత కృషి చేస్తారని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య అన్నారు. బుధవారం మన్నేగూడ వేద కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ విజయ గర్జన నియోజకవర్గ సన్నాహక సదస్సులో ఆమె హాజరై, మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో మండల పరిధి లోని టీఆర్ఎస్ అభివృద్ధికి కష్టపడి పని చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ లబ్దిపొందు తున్నారని ఆమె గుర్తు చేశారు. మండలంలో టీఆర్ఎస్ అభివృద్ధికి కార్యకర్తలు, నాయకులు మరింత కష్టపడి పని చేయాలని తెలిపారు.