Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని మంచాల గ్రామానికి చెందిన జంగాల రాములు ఉస్మానియా విశ్వవి ద్యాలయం 81వ స్నాతకోత్సవం సందర్భంగా గణితశాస్త్రంలో పీహెచ్డీ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కందుకూర్ మండల టీఎస్‌యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, జడీపహెచ్ఎస్ పులి మామిడిలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. జంగాల బుగ్గ రాములు మంచాల గ్రామ నివాసి.తను చిన్నతనం నుంచే గణితంపై మక్కువతో కష్టపడి చదివి, పరిశోధన చేసి, 2013 నుంచి దాదాపు ఎనిమిదేండ్లు పరిశోధన చేసి, అవార్డును పొందాడు. నిరుపేదరికంలో ఉండి కూడా తనతల్లిదండ్రుల వెంట పనికి వెళ్లి, చదుకు కొనసాగించారు. అంతే కాకుండా, గ్రామంలో స్నేహితులతో పెయింటింగ్ పనికి, వెళ్లుతూ, ఇంటర్, డిగ్రీ, బీఈడీ పూర్తి ఏసి,2012లో స్కూల్ అసిస్టెంట్ గణితంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతునే గణితంలో పరిశోధన చేశారు.