Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులవృత్తులకు ఉపాధిని కల్పిస్తాం
- నల్లచెరువుల్లో చేపపిల్లల విడుదల
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం నార్సింగి మున్సిపాలిటీలోని ఆరోవ వార్డులో నల్ల చెరువు (కొత్తచెరువు)లో ప్రభుత్వం అందిస్తున్న చేపపిల్లలను పాలకవర్గం, నాయకుల సమక్షంలో చెరువుల్లో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను అన్ని వర్గాల వారికి అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కులవృత్తులకు తగ్గట్టు వారికి జీవనోపాధిని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నార్సింగి ఛైర్పర్సన్ రేఖాయాదగిరి. వైస్ చైౖర్మెన్ వేంకటేష్యాదవ్, మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, కౌన్సిలర్లు పత్తి శ్రీకాంత్‌రావ్, శివారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్‌యాదవ్, నాయకులు హరిశంకర్, ఫారుక్, మహిద్, పత్తి రాజు, పొన్న రమేష్, గణేష్‌రెడ్డి, నాగరాజు, గోపాల గణేష్, యాదగిరి, అమ్ముల్ నాయకులు పాల్గొన్నారు.