Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడిపిఓ ప్రియదర్శిని
నవతెలంగాణ-దోమ
గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని సిడిపిఓ ప్రియదర్శిని సూచించారు. మంగళవారం మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో గర్భిణీ స్రీలు, బాలింతలపై అంగన్వాడీ సిబ్బంది తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేసిన తీరుపై పలు పత్రికలలో వచ్చిన కథనాలకు ఆమె ఎట్టకేలకు అధికారులు స్పందించి, అంగన్వాడీ సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో గర్భిణులకు, బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పౌష్టికాహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామాలలో పౌష్టికాహారం విషయంలో ఎదైనా ఇబ్బందులు కల్గినట్లయితే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహానికి గురికావడం సరికాదన్నారు.పౌష్టికాహారం ప్రతి గర్భిణీ స్త్రీకి అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. కార్యాక్రమంలో సర్పంచ్ కోళ్ల సురేష్, సుపర్ వైజర్ ఇందిర, సెక్టార్ సుపర్ వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు సావిత్రి, మల్లేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.