Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 1వ తేదీ వరకు అన్ని జిల్లాలు సిద్ధం చేయాలి
- వీడియో కాన్ఫెరెన్సులో కలెక్టర్లలకు ఆదేశం
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఎస్.ఎస్.ఆర్-2022 పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వచ్సిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్, 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫొటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేదీ నుంచి సరిచేసే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి, 5వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సిందిగా సూచించారు. ఓటర్లు ఇళ్లు మారడం వల్ల పోలింగ్ స్టేషన్లు అదనంగా అవసరం ఉన్నట్లయితే, లేదా పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చవలసినవి ఉన్న ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయవచ్చన్నారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోడానికి గరుడ యాప్ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ ఎలా ఉపయోగించాలో బూతు లెవెల్ అధికారులకు (బి.యల్.ఓ) పూర్తి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఇ. వి.యంలు పాత గోదాముల నుంచి కొత్త గొదాములకు మార్చాలని తెలిపారు. ఇంకా నిర్మాణం పూర్తి చేయని జిల్లాల్లో త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇ.వి.యం.ల భద్రత పై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్నీ జిల్లాల్లో స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. 2022 జనవరి 1 వ తేది నాటికి 18 ఏండ్లు పూర్తయిన యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా గాని, ఫారం 6 ద్వారా కానీ ఓటరు జాబితాలో తమ పేరులను నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం గావించాల్సిందిగా సూచించారు. గత ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన ఎన్నికల బిల్లులు, డి.సి. బిల్లులు పెట్టడం పెండింగ్ ఉంటే సత్వరమే దాఖలు చేయాలని తెలియజేసారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేర్లు మార్పుకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.