Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కోడూరి రమేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరుల త్యాగాలు వధా కావని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కోడూరి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పెత్తుల్లాలో పాషా నరహరి 32వ వర్ధంతి నిర్వహించారు. అనంతరం వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం మహబూబ్ పాషా, నరహరి తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. పెత్తందారి, పట్వారి పటేల్ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడికె భూములు ఇవ్వాలని ఉద్యమించారని అన్నారు. కూలి రేట్లు పెంచాలని పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కషి చేశారని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం నిరంతరం పోరాడారని అన్నారు. జిల్లాలో భూ పోరాటాలు చేసి పేద ప్రజలకు వేల ఎకరాలు భూ పంపిణీ చేశారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో విద్యారంగా అభివద్ధికి కషి చేశారని కొనియాడారు. వారి ఆదర్శాలతో భవిష్యత్తు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దయ్యాల గణేష్, బండి గణేష్, బోడ రమేష్, దయ్యాల భాస్కర్, బోడ సంజీవ, బోడ మహేందర్, బత్తుల కిష్టయ్య, బండి దాసు, కొరిమి అంజయ్య, ఆచ్చన శివ, నాగటి నరసింహ, పంబలి పాండు, పంతులు సత్తయ్య, కుమ్మరి వెంకటేష్, మహేష్ దయ్యాల కుమార్ బత్తుల శ్రీను కోడూరు జంగయ్య ప్రభాకర్ జగన్ ప్రభు తమ ప్రజలు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.