Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌలీస్పిరిట్ హైస్కూల్ ప్రిన్స్‌పాల్ సిసిల్
నవతెలంగాణ-షాబాద్
పిల్లలు చక్కగా చదివి వృద్ధిలోకి రావాలని హౌలీస్పిరిట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సిసిల్ అన్నారు. బుధవారం షాబాద్ మండల కేంద్రంలోని హౌలీస్పిరిట్ హైస్కూల్ విద్యార్థులకు షాద్‌నగర్‌కు చెందిన చిల్డ్రన్ ఇన్‌నీడ్ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదివి ఉన్నత స్థాయిలోకి వచ్చినప్పుడే, పాఠశాలకు, తల్లితండ్రులకు పేరు తెచ్చినవా రవుతారన్నారు. పిల్లల చదువుకోసం తమ వంతు సాయం చేస్తున్న చిల్డ్రన్ ఇన్‌నీడ్ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, థామస్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిల్డ్రన్ ఇన్‌నీడ్ సంస్థ సిబ్బంది తొంట శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.